ఆ ఇళ్లకు మహిళలే యజమానులు
ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన కీలక అప్‌డేట్‌ను వెల్లడించారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ‘ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులకు ఇంటి యజమానిగా మహిళలనే గుర్తిస్తాం’ అని ఆయన పేర్కొన్నారు. లబ్దిదారుల ఎంపిక వేగవంతం చేస్తున్నామని, నాలుగు దశలలో ఇళ్లు కేటాయిస్తామన్నారు. మొదటి దశలో నియోజక వర్గానికి 3500 ఇళ్లు ఇస్తామన్నారు. ఈ నెలాఖరులోగా లబ్ది దారుల వివరాలను ప్రకటిస్తామన్నారు. సొంత స్థలం ఉన్నవారికి రూ.5 లక్షలు దశల వారీగా ఇస్తాం. 400 చదరపు అడుగులలో ఇంటి నిర్మాణం ఉంటుందంటారు.