వంగలపూడి అనిత హౌస్ అరెస్ట్..
అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరంలో కలెక్టర్ నిర్వహించే ప్రజా స్పందన కార్యక్రమంలో పాల్గొనడానికి సిద్ధమైన తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలు వంగలపూడి అనితను పోలీసులు అడ్డుకున్నారు. విశాఖలోని డాక్టర్స్ కాలనీలోని అనిత నివాసంలోనే ఆమెను గృహ నిర్బంధం చేశారు. స్పందన కార్యక్రమంలో పాల్గొనడానికి కూడా అనుమతి ఇవ్వకపోవడం దారుణమని అనిత ఆవేదన వ్యక్తం చేశారు.