NewsNews AlertTelangana

ఆర్మూరు ఎమ్యెల్యే జీవన్ రెడ్డి హత్యకు కుట్ర: సర్పంచ్ భర్త అరెస్ట్

Share with

టీఆర్ఎస్ పార్టీ ఆర్మూరు ఎమ్యెల్యే, పీయూసీ ఛైర్మన్ జీవన్ రెడ్డి పై హత్య ప్రయత్నం జరిగింది. బంజారాహిల్స్ రోడ్ నం.12 లోని వేమూరీ ఎన్ క్లేవ్ లో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నివాసం వద్ద ఘటన జరిగినట్లు సమాచారం అందుతోంది. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పై హత్యాయత్నానికి ప్రయత్నించిన ఆర్మూర్ కు చెందిన కిల్లెడ గ్రామ సర్పంచ్ భర్త ప్రసాద్ గౌడ్ ప్రయత్నించాడు.

తన భార్యను సర్పంచ్ పదవి నుంచి సస్పెండ్ చేయడంతో కక్ష పెంచుకున్న భర్త ప్రసాద్ గౌడ్…ఈ దాడి ప్రయత్నించినట్లు సమాచారం అందుతోంది. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఇంటి వద్ద ప్రసాద్ గౌడ్ అనుమానాస్పదంగా తిరగడంతో పోలీసులకు సమాచారం తెలిపిన ఎమ్మెల్యే సిబ్బంది. ఈ నేపధ్యంలో అనుమానాస్పద వ్యక్తిని అదుపులోకి తీసుకున్న బంజారాహిల్స్ పోలీసులు అతని వద్ద కత్తి, ఒక పిస్తోలు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఆ వ్యక్తిని బంజారాహిల్స్ పోలీసులు విచారిస్తున్నారు. మరో వైపు ఈ ఘటనతో టీఆర్ఎస్ నేతల్లో అలజడి రేపింది