ఇజ్రాయిల్‌పై 5 వేల రాకెట్లతో విరుచుకుపడిన పాలస్తీనా
పాలస్తీనా, ఇజ్రాయిల్ మధ్య హఠాత్తుగా యుద్ధం ప్రారంభమయ్యింది. కేవలం 20 నిముషాల వ్యవధిలోనే పాలస్తీనాలోని గాజా నుండి 5 వేలకు పైగా రాకెట్లను ఇజ్రాయిల్‌పై ప్రయోగించారు. మరోపక్క హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్ భూభాగంలోకి చొచ్చుకుని వచ్చారు. ఈ ఆకస్మిక దాడితో అప్రమత్తమైన ఇజ్రాయిల్ సైన్యం ప్రతిదాడికి ప్రయత్నిస్తోంది. యుద్ధ ప్రాతిపదికపై నేడు సరిహద్దు ప్రజలను ఎవరినీ బయటకు రావద్దని హెచ్చరించింది. జెరూసలెం, టెల్ అవివ్ వంటి ప్రాంతాలతో పాటు దేశవ్యాప్తంగా ఎయిర్ రైడ్ సైరన్లను మ్రోగించారు. నేడు తెల్లవారు జామున గాజా స్ట్రిప్ ప్రాంతాలలో పాలస్తానీ మిలిటెంట్లు రాకెట్ల వర్షం కురిసింది. ఇజ్రాయెల్‌పై మిలిటరీ ఆపరేషన్‌ను ప్రారంభించామని హమాస్ మిలిటరీ వింగ్ హెడ్ మొహ్మద్ డెయిఫ్ ప్రకటించారు. దీనితో అప్రమత్తమైన ఇజ్రాయెల్ సైన్యం రాకెట్లను కూల్చే యాంటీ రాకెట్ ఢిఫెన్స్ వ్యవస్థను ఉపయోగించింది. దీనితో భారీ పేలుళ్లతో శబ్ధాలు వినిపించసాగాయి. తాము కూడా యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ దాడులతో సామాన్య ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోతున్నట్లు సమాచారం అందింది. సరిహద్దు ప్రాంతాలను పాలస్తీనా హస్తగతం చేసుకుంది. గతంలో 1967యుద్ధంలో తూర్పు జెరూసలెం, గాజాప్రాంతాలను పాలస్తీనా నుండి ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకుందని, ఇప్పుడు ఏర్పడిన స్వతంత్య్ర పాలస్తీనాలో ఆ భాగాలను తిరిగి కలపాలనే డిమాండ్ చేస్తోంది.