తెలంగాణ టీచర్లకు కేసీఆర్ సర్కారు షాక్
ఉపాధ్యాయుల ఆస్తుల వ్యవహారంపై తెలంగాణ సర్కారు కీలక ఆదేశాలు జారీ చేసింది. విద్యా శాఖలో పనిచేస్తున్న టీచర్లు ఏటా ఆస్తుల వివరాలు చెప్పాలని ఉత్తర్వులిచ్చింది. ఇకపై స్థిర, చర ఆస్తులు కొనుగోలు, అమ్మకాలపై ముందస్తు అనుమతి సైతం తీసుకోవాలంది. నల్గొండ జిల్లా చందంపేట గుంటిపల్లి పాఠశాల ప్రధాన ఉపాధ్యయుడు మహ్మద్ జావేద్ అలీ… ఉద్యోగాన్ని వదలి… రియల్ ఎస్టేట్, వక్ఫ్ బోర్డు ఆస్తుల సెటిల్మెంట్ వ్యవహారాలు చూసుకుంటున్నారని తేలడంతో… విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్ మెంట్ విభాగం రంగంలోకి దిగింది. అలీపై వస్తున్న ఆరోపణలన్నీ నిజమేనని తేల్చింది. ఓవైపు అలీపై చర్యలు తీసుకుంటూనే… మరోవైపు పాఠశాల ఉద్యోగులందరూ ఇకపై ఆస్తుల వివరాలన్నీ తెలపాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఐతే సర్కారు నిర్ణయంపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయ్… సీఎం కేసీఆర్ ఏటా ఆస్తుల వివరాలు ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్.