ప్రజా వేదిక కూల్చి నేటికి మూడేళ్లు
చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు నిరంతరం పని చేస్తే… జగన్ రాష్ట్రాన్ని కూలగొట్టడానికి… ప్రజా వేదిక కూల్చి వేతతో ప్రారభించాడంటూ టీడీపీ విరుచుకుపడింది.
151సీట్లు ఇస్తే సైకో తనంతో రాష్ట్రాన్ని నాశనం చేశారంటూ విరుచుకుపడ్డాడు టీడీపీ నేత బుద్దా వెంకన్న. మూడేళ్లుగా కూల్చివేతలు, పరిశ్రమలు తొలి వేతలతో ధ్వంస రచన చేశారన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఒక్క పరిశ్రమ కూడా నిర్మాణం జరగలేదన్నారు. ప్రజా వేదిక సాక్షిగా నిరసన తెలపడానికి వెళితే అడ్డుకుంటున్నారన్నారు. జగన్ కూల్చిన కట్టడాల పునర్నిర్మాణం ప్రజా వేదికతోనే ప్రారంభిస్తామన్నారు బుద్దా. పోలీసులు చట్టపరంగా పని చేయకుండా ఒత్తిడి తెస్తున్నారన్నారు. తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని.. 2024లో టిడిపి అధికారంలోకి రావడం ఖాయమన్నారు.