Andhra PradeshNews

ఆత్మకూరు ఉప ఎన్నికల కౌంటింగ్ కాసేపట్లో….

Share with

నెల్లూరు: కాసేపట్లో ఆత్మకూరు ఉప ఎన్నిక కౌంటింగ్ మొదలుకానుంది. ఆత్మకూరు ఆంధ్ర ఇంజనీరింగ్ కాలేజీలో కౌంటింగ్ పక్రియకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ కేంద్రం వద్ద భారీగా పోలీస్ బందోబస్తు నిర్వహిస్తున్నారు.

పాస్ లు ఉంటేనే ఏజంట్లు, అభ్యర్థులు కౌంటింగ్ హాలు కేంద్రంలోకి అనుమతిస్తారు. ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రారంభం
కానుంది.ఉప ఎన్నికల్లో 64.17 శాతం ఓట్లు పాలయ్యాయి. మొత్తం ఓట్లు 2,13,388. పోలైన ఓట్లు 1,37,081. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. కౌంటింగ్ హాల్లో 14 టేబుల్స్ ఏర్పాటు చేశారు. మొత్తం 20 రౌండ్స్ లో ఓట్ల లెక్కింపు పూర్తి అవుతుంది. ఒక్కో టేబుల్ లో 20 నిమిషాల్లో ఫలితం వెలువడనుంది.