ఫ్యాషన్‌షోలో కన్నుకొట్టిన జాన్వీకపూర్
దివంగత అందాల తార శ్రీదేవి కుమార్తె జాన్వీకపూర్ లాక్మే ఫ్యాషన్ షోలో కన్ను కొట్టి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ బ్యూటీ ఎన్టీఆర్ దేవర మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఇటీవల జరిగిన లాక్మే ఫ్యాషన్ షోలో జాన్వీ బ్లాక్ డ్రెస్‌లో క్యాట్ వాక్ చేస్తూ అందర్నీ ఆకట్టుకుంది. హఠాత్తుగా నడుస్తూ తన మత్తెక్కించే కళ్లతో కన్ను కొట్టింది. ఈ ఘటన ఈ ‘షో’కే హైలట్ అయ్యింది. ఇప్పుడు ఈ ‘షో’ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.