“జగన్ వాటిని తిరిగి అప్పగించండి”:ఏపీ ప్రభుత్వం
మాజీ సీఎం జగన్‌కు ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. కాగా ఈ లేఖలో ప్రభుత్వ సొమ్ముతో కొనుగోలు చేసిన ఫర్నీచర్,ఎలక్ట్రికల్ వస్తువులు వెంటనే ప్రభుత్వానికి అప్పగించాలని సాధారణ పరిపాలన శాఖ ఈ లేఖలో పేర్కొంది.గతంలో జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పుడు ప్రభుత్వ నిధులతో ఫర్నీచర్ సహా పలు వస్తువులను తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం కోసం కొనుగోలు చేయించారని తెలిపింది. అయితే ఆయన తన పదవికి రాజీనామా చేశాక వాటిని ఇంకా ప్రభుత్వానికి తిరిగి అప్పగించలేదని వెల్లడించింది. ఈ మేరకు త్వరగా వాటిని ప్రభుత్వానికి తిరిగి సమర్పించాలని GAD లేఖ ద్వారా మాజీ సీఎం జగన్‌ను కోరింది.