టీఆర్ఎస్‌లో కుమ్ములాటలు… సబితతో నాశనం
టీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు పతాక స్థాయికి చేరుకుంటున్నాయ్… తెలంగాణ విద్యా మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై విరుచుకుపడ్డారు జీహెచ్ఎంసీ మాజీ మేయర్, టీఆర్ఎస్ కీలక నేత తీగల కృష్ణారెడ్డి. మీర్‌పేటను సబిత నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రాంతం కోసం అవసరమైతే ఆమరణ నిరాహారదీక్ష చేస్తానన్నారు. సబితా ఇంద్రారెడ్డి కబ్జాలను ప్రోత్సహిస్తున్నారని… చెరువులు, స్కూళ్లను కూడా వదలడం లేదన్నారాయన. టీఆర్ఎస్ నుంచి సబిత ఎన్నికల్లో గెలవలేదని… అభివృద్ధిని గాలికొదిలేశారని తీగల ఆరోపించారు. వాస్తవానికి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మహేశ్వరం నుంచి తీగలపై సబితా కాంగ్రెస్ టికెట్ పై విజయం సాధించారు. ఆ తర్వాత సబిత టీఆర్ఎస్ పార్టీలో చేరి మంత్రిగా జాక్ పాట్ కొట్టేశారు. నాటి నుంచి నియోజకవర్గంలో ఇరువర్గాల మధ్య ఆధిపత్యపోరు కొనసాగుతోంది.