Home Page SliderTelangana

ధరణి వెబ్‌సైట్ అవినీతికి మారుపేరయితే.. భూస్వామిత్ర భూమి హక్కును కల్పిస్తోంది-రాజనాథ్

Share with

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా జమ్మికుంట మహాగర్జన సభలో పాల్గొన్నారు కేంద్రమంత్రి రాజనాథ్ సింగ్. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ ప్రభుత్వం అవినీతిపై మండిపడ్డారు. ధరణి వెబ్‌సైట్ అవినీతికి మారుపేరుగా మారిందని ఆరోపించారు. ఈ వెబ్‌సైట్ లక్షల ఎకరాలను మాయం చేసిందన్నారు. అదే ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన భూస్వామిత్ర యాప్‌ ద్వారా ప్రతీ ఒక్కరికీ వారి భూమిపై పరిపూర్ణ హక్కులు కలుగజేస్తోందని, వివాదాలకు తావు లేకుండా బ్యాంకులు లోన్లు ఇస్తున్నాయని తెలియజేశారు. దేశవ్యాప్తంగా ఈ యాప్‌లో శాటిలైట్ ఆధారంగా హద్దులు నిర్ణయించబడుతున్నాయని పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం 4 కోట్ల మంది పేదలకు ప్రధానమంత్రి ఆవాస యోజన కింద ఇల్లు కట్టించి ఇస్తోందన్నారు. అలాగే కాంగ్రెస్ హయాంలో పేదలకు రూపాయి ఇస్తే అది దళారీల చేతులు మారి పేదల వద్దకు 20 పైసలు మాత్రమే చేరేదని, మోదీ ప్రభుత్వంలో జన్‌ధన్ ఖాతాలు తెరిపించి, నేరుగా వారి ఖాతాలకే డబ్బును వేస్తున్నామని తెలియజేశారు. తెలంగాణలో పార్టీలు కుల,మత,ప్రాంత, వర్గాల ఆధారంగా రాజకీయాలు చేస్తున్నారని, కానీ బీజేపీకి అన్ని సమానమేనన్నారు. రాబోయే ఎన్నికలలో కారు బేకారు అవుతుందని జోస్యం చెప్పారు. ప్రజలు కమలం పార్టీనే గెలిపిస్తారని, బీఆర్‌ఎస్‌ను తరిమి కొడతారని పేర్కొన్నారు.