తిన్నింటి వాసాలు లెక్కపెట్టొద్దు
తెలంగాణ మాజీ సీఎం కేసిఆర్…కొంత మంది మాజీ మంత్రులు,ఎమ్మెల్యేలపై ఫైర్ అయ్యారు.పార్టీ పని అయిపోయిందంటూ పొలిటికల్ హబ్‌లో దుష్ప్రచారం చేస్తున్నారని అలాంటి వాళ్లు పద్దతి మార్చుకుంటే మంచిదని హితవు పలికారు.తిన్నింటి వాసాలు లెక్కపెట్టొద్దని కోరారు.బుధవారం తెలంగాణ ప్రగతి భవన్ కి వచ్చిన ఆయన ఈ సందర్భంగా నాయకులనుద్దేశించి మాట్లాడారు.అరచేతితో సూర్యుణ్ణి..అధికారంలోకి రాకుండా బీ.ఆర్.ఎస్.ని ఎవరూ ఆపలేరంటూ ఘాటుగా మాట్లాడారు.కాంగ్రెస్ మోసపూరిత పాలన ఎలా ఉందో ప్రజలకు బాగా అర్ధమైందని,ఇలానే పోరాటాలు చేస్తూ ప్రజల్లో ఉండగలిగితే మళ్లీ గులాబి జెండా తెలంగాణ గడ్డపై రెపరెపలాడటం ఖాయమన్నారు.