కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు క్లీన్ చిట్
కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు ముడా కేస్ నుండి ఎంతో రిలీఫ్ లభించింది. ముడా కేసులో ఆయనకు లోకాయుక్త క్లీన్ చిట్ ఇచ్చింది. మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ భూముల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడినట్లు సీఎం సిద్దరామయ్య, ఆయన భార్య, కుటుంబీకులపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో ఆయనను విచారించడానికి గవర్నర్ ఈడీకి అనుమతి కూడా ఇచ్చారు. అయితే ఈ వ్యవహారంలో ఆయనపై, ఆయన సతీమణిపై ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని లోకాయుక్త పోలీసులు వెల్లడి చేశారు. లోకాయుక్త నుండి సిద్దరామయ్యకు క్లీన్ చిట్ లభించినట్లే.