చరిత్రలో మొదటిసారి ఖైదీల కోసం..
యూపీ జైళ్లలోని ఖైదీలకు శుభవార్త. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం యూపీలోని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 75 జైళ్లలోని 90 వేల మంది ఖైదీల కోసం చరిత్రలో ఎన్నడూ ఎరుగని కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రయాగరాజ్‌లో జరుగుతున్న కుంభమేళాకు ఇప్పటివరకూ 55 కోట్ల మందికి పైగా భక్తులు వచ్చి త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. ఇలా గంగా జలాలతో స్నానం చేసే అవకాశం ఖైదీలకు కూడా కల్పించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. త్రివేణి సంగమంలోని పవిత్రజలాలను సేకరించి, ఫిబ్రవరి 21 నాడు జైళ్లకు తీసుకెళతామని, కారాగారాలలోని నీటిలో ఈ గంగాజలాలను కలుపుతామన్నారు. పవిత్రస్నానాల అనంతరం పూజలు, ఇతర క్రతువులు కూడా చేసేందుకు అవకాశాలు కల్పిస్తామని రాష్ట్ర జైళ్ల శాఖ మంత్రి తెలిపారు.