NationalNews Alert

బీసీసీఐ అమితాబ్ చౌదరీ హఠాన్మరణం

Share with

బీసీసీఐ మాజీ సెక్రటరీ అమితాబ్ చౌదరి మృతిచెందారు. స్వస్థలం ఝార్ఖండ్‌లోని రాంచిలో అమితాబ్ తుదిశ్వాస విడిచారు. తీవ్ర గుండెపోటు కారణంగా తన నివాసంలో ఆకస్మాత్తుగా  కుప్పకూలిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు స్ధానిక ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి చేజారడంతో , తీవ్రమైన గుండెపోటుతో మరణించినట్టు డాక్టర్లు తెలిపారు. కాగా బీసీసీఐ ఏర్పాటు చేసిన కమిటీల్లో కీలక సేవలందించారు. గతంలో కూడా అమితాబ్ చౌదరి జేపీఎస్‌పీ చైర్మన్‌గా పనిచేశారు. ఈయన మృతిపై స్పందించిన ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ట్విట్టర్ వేదికగా విచారం వ్యక్తం చేసారు.

 “ జేపీఎస్‌సీ చైర్మన్ అమితాబ్ చౌదరీ జీ మరణం బాధకరమని , రాష్ట్రంలో క్రికెట్ అభివృధ్దికి ఎంతగానో కృషి చేశారన్నారు. దేవుడు ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థిస్తానన్నారు. అలాగే వారి కుటుంబ సభ్యులకు దేవుడు మనోధైర్యం ఇవ్వాలని సంతాపాన్ని తెలియచేశారు.