క్రికెట్ కూడా ఫుట్ బాల్‌లా మారిపోతోంది…!
ఫుట్ బాల్ లా మన క్రికెట్ కూడా తయారవుతోందని మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. యూరప్‌లో ఫుట్ బాల్ టీంలు, ప్లేయర్లు ప్రతి దేశంతో ఆట ఆడటం లేదని.. వారు కేవలం నాలుగేళ్లకోసారి ప్రపంచ కప్‌లో మాత్రమే ఆడతారని కపిల్ దేవ్ చెప్పారు. ఇప్పుడు మన క్రికెట్ కూడా అదే బాటలో కొనసాగే పరిస్థితి కనిపిస్తుందన్నారు. వన్డే, టెస్ట్ ఫార్మాట్లను కాపాడేందుకు ఐసీసీ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఐసీసీ కేవలం టీ20 ఫార్మాట్ క్రికెట్‌ను మాత్రమే కాకుండా.. వన్డేలు, టెస్టుల ఫార్మాట్‌ను బతికించడానికి తగినంత సమయం కేటాయించాలని కపిల్ దేవ్ కోరారు. భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ తదితర దేశాలు టీ20 లీగ్‌ల కోసం తమ జట్లకు ప్రత్యేకంగా సమయం కేటాయిస్తున్నాయని కపిల్ దేవ్ పేర్కొన్నారు.