NationalNews

కాశ్మీర్ లోయలో ఉగ్రమూకల దాడులు

Share with

ఒకప్రక్క భారతదేశం వజ్రోత్సవ వేడుకలలో మునిగిపోయి ఉంటే మరోప్రక్క కాశ్మీర్‌లో ఉగ్రమూక రెచ్చిపోతోంది. కేవలం 48 గంటల వ్యవధిలోనే మూడు ఉగ్రవాద దాడులు జరిగాయి. నిన్న స్వాతంత్ర దినోత్సవం రోజున బద్గామ్‌లోని గోపాల్ పోరా ఛాడూరా వద్ద ఉగ్రవాదులు గ్రనేడ్‌తో దాడి చేయగా కరణ్ కుమార్ సింగ్ అనే వ్యక్తి గాయపడ్డాడు. అతడిని శ్రీనగర్‌లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతానికి అతనికి ప్రాణాపాయం లేదు. శ్రీనగర్‌లోని పోలీస్ కంట్రోల్ రూమ్‌పై కూడా దాడి చేసారు. పోలీస్ సిబ్బంది కూడా గాయపడ్డారు.

కాగా నేడు దక్షిణ కశ్మీర్‌లోని షోపియన్ జిల్లాలోని ఛోటేగావ్ ప్రాంతంలో ఇద్దరు సోదరులపై ఉగ్రదాడులు జరిగాయి. వారిపై  కాల్పులు జరిపారు. వారి పేర్లు సునీల్ కుమార్, పింటూ కుమార్. వీరిలో సునీల్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన పింటూను ఆసుపత్రికి తరలించారు. మరో వైపు హిందూ మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తులపై కాల్పులు జరగగా ఓ వ్యక్తి మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారు. దాడులు జరిగిన ప్రదేశాలను భద్రతా దళాలు అదుపులో తీసుకుని ఉగ్రావాదుల కోసం గాలిస్తున్నారు. మొత్తం మూడు దాడులు జరుగగా కేవలం హిందూ మైనార్టీలపైనే 24 గంటల వ్యవధిలోనే రెండు దాడులు జరిగాయి.  ఈ విషయాన్ని జమ్ము కశ్మీర్ పోలీస్ ట్విట్టర్‌లో వెల్లడించారు.