InternationalNews

జింబాబ్వేలో టీమిండియాకు నీటి కష్టాలు

Share with

మూడు వన్డేల సిరీస్ కోసం జింబాబ్వేలో అడుగుపెట్టిన భారత జట్టుకి గట్టి షాక్ తగిలింది. అదేంటంటే కేఎల్ రాహుల్ సారధ్యంలోని టీమిండియా జట్టుకు BCCI ముఖ్యమైన సూచన చేసింది. జింబాబ్వేలో నీటి కొరత చాలా విపరీతంగా ఉంది. వన్డే సిరీస్ జరగాల్సిన హరారేలో ప్రజలు తాగునీటికి కూడా కటకటలాడుతున్నారని, క్రికెటర్లందరూ నీటిని జాగ్రత్తగా వాడుకోవాలని, తక్కువ నీటితోనే స్నానాలు ముగించాలని స్విమ్మింగ్ పూల్స్‌ను వాడకూడదని ఆదేశాలు జారీ చేసింది.

టీమిండియాకు ఇలా నీటి కొరత ఎదురవడం మొదటిసారేం కాదు. గతంలో 2018లో కూడా భారతజట్టు దక్షిణాఫ్రికాకు వెళ్లినప్పుడు ఇదే పరిస్థితి తలెత్తింది. అప్పుడు ట్యాంకర్ల ద్వారా నీటిని తీసుకొచ్చి క్రికెటర్ల అవసరాలు తీర్చేవారు. అయితే జింబాబ్వే ప్రజల నీటికష్టాలు తెలుసుకున్న క్రికెటర్లు తాము సర్దుబాటు చేసుకుంటున్నట్లు తెలిపారు. కరువుతో కొట్టుమిట్టాడుతున్న జింబాబ్వేలో ప్రతీ సంవత్సరం ఈ సీజన్లో నీటి కొరత సాధారణం. నీటిని శుద్దిచేసే యంత్రాలు కూడా పాడవడంతో ప్రజలు కలుషితనీటినే తాగాల్సి వస్తోంది.