Andhra PradeshNews Alert

ఏపీ ఎంసెట్‌లో అబ్బాయిలదే ఆధిక్యం

Share with

ఈఏపీసెట్ ఫలితాలను ఈరోజు రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో విడుదల చేశారు. ఈఏపీసెట్ పరీక్షలు జూలై 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు,  ఇంజనీరింగ్ పరీక్షలు జూలై 4 నుంచి 8వ తేదీ వరకు జరిగాయి. అగ్రికల్చరల్, ఫార్మసీ పరీక్షలను 11, 12వ తేదీల్లో నిర్వహించారు. అయితే ఈసారి ఈఏపీసెట్ పూర్తయిన రెండు వారాల వ్యవధిలోపే ఫలితాలు విడుదల చేసింది ప్రభుత్వం. గతంలో ఇంటర్ ద్వారా ఇచ్చిన వెయిటేజ్ మార్కులు ఈ సారి ఉండవని ముందే ప్రకటించారు. కేవలం ఎంసెట్ మార్కులు మాత్రమే పరిగణనలోకి   తీసుకుంటారు.

ఏపీలో ఈఏపీసెట్‌కు మొత్తం 3,00,111 మంది దరఖాస్తు చేశారు. వారిలో 1,49,118 మంది విద్యార్థినులు, 1,50,993 మంది విద్యార్థులు ఉన్నారు.  1,94,752 మంది విద్యార్థి, విద్యార్థినులు పరీక్షలు రాయగా 1,73,572 ఇంజనీరింగ్ లో అర్హత సాధించారు. అగ్రికల్చర్ విభాగం లో 87,744 మంది లో 83,411 మంది క్వాలిఫై అయ్యారు. ఈవిభాగం లో 95.06 శాతం అర్హత సాధించారు. ఇంజినీరింగ్ కు 89.12 శాతం అర్హత పొందారు. ఇంజినీరింగ్ విభాగంలో మొదటి పది ర్యాంకులూ అబ్బాయిలకే లభించాయి. ఈ విభాగంలో టాప్‌టెన్‌లో నలుగురు తెలంగాణ విద్యార్థులు ఉన్నారు. ఇంజనీరింగ్‌లో మొదటి ర్యాంక్ హరెన్ సాత్విక్‌కు లభించగా… సెకండ్ ర్యాంక్ లక్ష్మి సాయి లోహిత్, థర్డ్ ర్యాంక్ హిమ వంశీకి వచ్చింది. అగ్రి కల్చర్ విభాగంలో ఫస్ట్ ర్యాంక్ గుంటూరుకు చెందిన దినేష్ కార్తిక్‌కు రాగా పశ్చిమగోదావరికి చెందిన సాయి దుర్గ కీర్తి తేజాకు సెకండ్ ర్యాంక్,  అసు హిందూకు థర్డ్ ర్యాంక్ లభించాయి.