NewsTelangana

తెలంగాణకు షాక్… మళ్లీ మూడు రోజులు వర్షాలట…

Share with

ఇప్పటికే వానలో తల్లడిల్లుతున్న జనాలకు మరో చేదు వార్త వాతావరణ శాఖ విడుదల చేసింది. తెలంగాణలో మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది. మధ్యప్రదేశ్… ఆగ్నేయ ప్రాంతంపై గాలులతో ఉపరితల ఆవర్తనం మూడు కిలో మీటర్ల ఎత్తు వరకు వ్యాపించినట్టు వాతావరణ శాఖ పేర్కొంది. దక్షిణభారతదేశం వైపు భారీగా మేఘావృతమై ఉందని… ఇది వచ్చే మూడు రోజుల పాటు కొనసాగుతుందని తెలిపింది. హైదరాబాద్ లో రాత్రంత భారీ వర్షం కురిసింది. ప్రస్తుతం మేఘావృతమై ఉంది. ఇప్పటికే రోడ్లన్నీ నాని ఉండటంతో… మరోసారి వర్షం పడితే నగరవాసికి ఇబ్బందులు తప్పేలా లేవు. రాత్రి 11 గంటల తర్వాత వర్షం మొదలైంది. ఉదయం సైతం వర్షం కురుస్తూనే ఉంది.