Home Page SliderNewsTrending Today

“అబ్ శనివార్ బనేగా ఫనివార్”

Share with

మన ఇండియన్ టివి ఛానెల్స్‌లలో వివిధ రకాలైన షోస్ వస్తుంటాయి. అందులో కొన్ని ఆశించిన స్థాయిలో అలరించలేకపోయిన కొన్ని మాత్రం సూపర్ హిట్ అందుకుంటాయి. వాటిలో మనం చెప్పుకోబోయేది టివి షోస్‌లలో అత్యంత పాపులారిటీ తెచ్చుకున్న హిందీ షో అయిన “ద కపిల్ శర్మ షో”.

కమిడియన్ అయిన కపిల్ శర్మ యాంకర్‌గా నిర్వర్తించే ఈ షోలో కామెడీకి లోటు ఉండదు. ఏదైనా చూసే కొద్ది బోర్ కొడుతుంటుంది. కాని ఈ షో ఇన్ని సీజన్స్ అయినా పాపులారిటీ ఏమాత్రం తగ్గలేదంటే అర్థం చేసుకోవచ్చు అది ఎంతగా ఎంటర్టైన్ చేస్తుందో. భాషతో సంబంధం లేకుండా ఇండియా మొత్తం పాపులారిటీ తెచ్చుకుంది.

ఈ షో మధ్య మధ్యలో బ్రేక్ ఇస్తూ అనేక సీజన్స్ కంప్లీట్ చేసింది. ఫస్ట్ సీజన్ నుంచి అత్యంత ప్రేక్షకాదరణ పొందిన ఈ షో ఇప్పుడు మళ్ళీ మొదలవబోతోంది. ఈ షో సెప్టెంబర్ 21 నుంచి సోని సెట్ మాక్స్‌లో ప్రసారితమవుతుంది.

తమ సినిమా ప్రమోషన్ల కోసం సినిమా వాళ్ళు, క్రికెటర్స్ మొదలయిన సెలబ్రెటీలు ఇందులో పాల్గొంటారు.