యోగి ‘మూడు కోతులు’ వ్యాఖ్యపై అఖిలేశ్ ఘాటైన కౌంటర్
బీహార్ ఎన్నికల ప్రచారంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేసిన ‘మూడు కోతులు’ వ్యాఖ్యలు రాజకీయంగా వేడెక్కిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలకు సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఘాటు ప్రతిస్పందన ఇచ్చారు.
“ప్రజల అసలు సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికి BJP ఇప్పుడు మూడు కోతుల సిద్ధాంతాన్ని గుర్తుచేసుకుంటోంది.
అసలు ఆదిత్యనాథ్ ఒక కోతుల గుంపులో కూర్చుంటే ఆయనను ఎవరూ గుర్తుపట్టలేరు,” అని అఖిలేశ్ ఎద్దేవా చేశారు.
గమనించదగ్గ విషయం ఏమిటంటే, యోగి ఇటీవల రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్, అఖిలేశ్ యాదవ్‌లను ‘మూడు కోతులు’తో పోల్చి విమర్శించిన సంగతి తెలిసిందే.

