Home Page SliderNational

జొమాటో గిన్నిస్ రికార్డ్ సొంతం చేసుకుంది

ప్రముఖ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటోకు అరుదైన రికార్డ్ దక్కింది. అత్యవసర సమయాల్లో ఉన్నవారికి వైద్యసాయం అందించేలా తమ డెలివరీ బాయిస్‌కు శిక్షణ ఇచ్చింది. ఒకే వేదికపై 4,300 మంది డెలివరీ పార్ట్‌నర్స్‌కు సీపీఆర్ శిక్షణ అందించి గిన్నిస్ రికార్డును సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ తెలిపారు. ఈ శిక్షణ తీసుకున్న వారి బ్యాగ్‌పై గ్రీన్ కలర్ ‘+’ గుర్తు ఉంటుందని పేర్కొన్నారు.