Andhra PradeshBreaking NewscrimeHome Page SliderNews AlertPolitics

వైసీపీ నేత హత్య తీర్పు..11 మందికి యావజ్జీవ శిక్ష

కర్నూలు జిల్లా వైసీపీ నేత చెరుకులపాడు నారాయణ రెడ్డి హ్యతకేసులో కర్నూలు జిల్లా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 11 మంది నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ కర్నూలు జిల్లా కోర్టు తీర్పు ఇచ్చింది. 2017 మే 21న రామకృష్ణాపురంలో వివాహానికి హాజరై వస్తుండగా కృష్ణగిరి సబ్ స్టేషన్ దగ్గర నారాయణరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ప్రత్యర్థులు అతి కిరాతకంగా హత్య చేశారు. ఈ సంఘటనలో నారాయణరెడ్డితో పాటు ఆయన అనుచరుడు బోయ సాంబశివుడు కూడా హత్యకు గురయ్యారు. ఈ జంట హత్యల కేసులో 17 మంది నిందితులు కాగా ఒకరు మృతి చెందారు. సాక్ష్యాధారాలు రుజువు కాకపోవడంతో ఐదుగురిని నిర్దోషులుగా ప్రకటించింది. దివంగత నారాయణరెడ్డి భార్య పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి స్పందించారు. కోర్టు తీర్పుతో న్యాయస్థానాల పట్ల మరింత నమ్మకం పెరిగిందని చెప్పారు.