రాహుల్, ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన వైఎస్ షర్మిల
రాహుల్, ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు వైఎస్ షర్మిల. వైఎస్సార్ తెలంగాణ పార్టీని విలీనం చేస్తున్నట్టు చెప్పారు. దేశంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, దేశంలోని అన్ని కులాలు, మతాలు కలిసి ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ అవసరం ఎంతో ఉందని ఆమె చెప్పారు. కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ అని, కాంగ్రెస్ పార్టీలో చేరడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సమయంలో షర్మిల వెంట ఆమె భర్త బ్రదర్ అనిల్ కూడ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తనను ఎంతో గౌవరంగా పార్టీలో చేర్చుకుందని ఆమె చెప్పారు. మణిపూర్ లో క్రైస్తవులపై దాడులు దారణమని ఈ సందర్భంగా షర్మిల చెప్పారు.
