ఫ్రెండువురా నువ్వు..
ఎంత గొప్ప ఫ్రెండ్షిప్ అయినా… ఏదో విషయం దగ్గర సాధారణంగా చెడిపోతుంది.కానీ క్రైమ్ నేపథ్యంతో ఏర్పడే సంబంధాలు చాలా కాలం నిలిచి ఉంటాయి. క్రైం అంటే ఇక్కడేదో క్రైం చేశారని, వాళ్ళంతా క్రిమినల్స్ అనుకునేరు. ఉద్దేశ్యపూర్వకంగానో,యాదృచ్చికంగానో జైలుకెళ్తే దాన్ని నేరంగా పరిగణించక తప్పదు.అలాంటి నేపథ్యంలో ఉన్న నేటి సీఎం రేవంత్ రెడ్డి ఒకప్పటి సహచర జైలు ఖైదీతో ఉన్న దోస్తానా ఎలాంటిదో గురువారం తెలంగాణ ప్రపంచానికి తెలిసింది.ఏ నేరం చేసి జైలుకెళ్లాడో తెలీదు గానీ నాగయ్య అనే ఖైదీని సీఎం రేవంత్ కొద్ది రోజుల కిందట క్షమాబిక్షపై విడిపించి, జైలు జీవితం నుంచి విముక్తి పలికించారు.ఓటుకు నోటు కేసులో అప్పల్లో జైల్లో ఉన్న రేవంత్ రెడ్డికి సపర్యలు చేసిన నాగయ్య అనే వ్యక్తిని సీఎం స్వయంగా రిలీజ్ చేయించారు.ఈ సందర్భంగా నాగయ్య సీఎంని కలిసి న్యూ ఇయర్ విషెస్ చెప్పాడు.నాగయ్యను ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నాడు రేవంత్. అంతేకాదు…. ఫ్రెండువురా నువ్వు.. అన్నట్లుగా భుజం మీద చేయి వేసి ఫోజిచ్చాడు.ఇప్పుడు ఈ ఫోటో స్టేట్ ఆఫ్ తెలంగాణలో ఫన్నీ ఫన్నీగా కామెంట్ సెక్షన్లలో వైరల్ గా మారింది.

