HealthHome Page Slider

ఈ లక్షణాలతో గుండెపోటును పసిగట్టవచ్చు.. అదేంటో తెలుసుకోండి..!

ప్రస్తుతం గుండెపోటు అంటేనే ప్రతి ఒక్కరూ హడలిపోతున్నారు. ఇటీవల కాలంలో ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిన వ్యక్తుల వీడియోలు ఆన్ లైన్ లో ప్రత్యక్షమవుతున్నాయి. ప్రస్తుతం సంబంధం లేకుండా చాలా మందిలో గుండె సంబంధిత సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. గుండె జబ్బుల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దేశంలో ఏటా మూడు మిలియన్ల మంది గుండె సంబంధిత సమస్యలతో మరణిస్తున్నారు. ఈ వ్యాధి చాలా ప్రమాదకరం. కొన్నిసార్లు హాస్పిటల్ కు చేరే లోపే మరణిస్తారు. దీని కారణం మన లైఫ్ స్ట్రైల్.

రక్తంలో కొలెస్ట్రాల్ పెరగడం వల్ల కరోనరీ హార్ట్ డిసీజ్ వచ్చే ప్రమాదం ఉంది. అధిక రక్తపోటు, పొగాకు పొగ వంటి ఇతర ప్రమాద కారకాలు ఉన్నప్పుడు, ఈ ప్రమాదం మరింత పెరుగుతుంది. ఒక వ్యక్తి యొక్క కొలెస్ట్రాల్ స్థాయి వయస్సు, లింగం, వారసత్వం మరియు ఆహారం ద్వారా కూడా ప్రభావితమవుతుంది.

నిజానికి గుండెపోటు రావడానికి 10 రోజుల ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఆ లక్షణాలను సకాలంలో గుర్తిస్తే రోగి ప్రాణాలతో బయటపడవచ్చు.

  1. ఛాతీ చుట్టూ అసౌకర్య ఒత్తిడి : గుండెపోటుకు ముందు, మీరు ఛాతీ చుట్టూ చాలా అసౌకర్యాన్ని అనుభవించవచ్చు. ఇటువంటి పరిస్థితులో ఉన్న రోగి ఛాతీ బిగుతు, భారం లేదా ఛాతీ మధ్యలో నొప్పిని అనుభవించవచ్చు.
  2. అలసట : రోగి గుండెపోటుకు ఒక నెల ముందు అలసటను అనుభవించవచ్చు. ఈ లక్షణం పురుషుల కంటే మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది.
  3. చెమటలు పట్టడం : గుండెకు తగినంత రక్త సరఫరా జరగకపోవడం వల్ల రోగికి విపరీతంగా చెమట పట్టడం ప్రారంభమవుతుంది. చాలా మంది దీన్ని తేలికగా తీసుకుంటారు. మీరు అలాంటి లక్షణాన్ని గమనించనట్లయితే, వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి. అలాగే కొందరు అజీర్ణం లేదా వికారం వంటి సమస్యలను ఎదుర్కుంటారు.
  4. గుండె కొట్టుకోవడం : గుండెకు సరిపడా రక్తం అందకపోతే శరీరంలో అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి. రోగి గుండె వేగం కూడా పెరుగుతుంది.
  5. శరీరంలోని వివిధ భాగాలలో నొప్పి : గుండెపోటుకు కనిపించే లక్షణాల్లో శరీరం నొప్పులు ఒకటి. ఈ స్థితిలో రోగికి ఛాతీ, వెనుక భుజాలు, చేతులు, మెడ దవడలో నొప్పిని అనుభవించవచ్చు. నిజానికి గుండెకు సంబంధించిన సమస్య వచ్చినప్పుడు ధమనులు మూసుకుపోతాయి. ఇది నొప్పిని కలిగిస్తుంది.
  6. తరచుగా తల తిరగడం : కారణం లేకుండా తల తిరగడం అనిపిస్తే తేలిగ్గా తీసుకోకండి. వాస్తవానికి, తల తిరగడం, తలనొప్పి, ఛాతీ నొప్పి, శ్వాస ఆడకపోవడం, తక్కువ రక్త పరిమాణం, తక్కువ రక్తపోటు గుండె పోటుకు లక్షణాలు కావచ్చు.