యోగి…ముస్లిం టోపీపై దుమారం
యూపి సీఎం యోగి ఆదిత్యానాథ్ ముస్లిం టోపీ ధరించారంటూ కొంత మంది వ్యక్తులు AI వీడియోని రూపొందించి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు.దీంతో హజ్రత్‌గంజ్‌లోని నర్హి ప్రాంతంలో నివసించే బీజేపీ నాయకుడు రాజ్‌కుమార్ తివారీ ఈ డీప్‌ఫేక్ వీడియోకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు…‘ప్యారా ఇస్లాం’ ”ఎక్స్” హ్యాండిల్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.” హిందుత్వ నైట్ ” ఎక్స్ ఖాతా హ్యాండిల్ ద్వారా ఈ వీడియో అప్‌లోడ్ అయ్యినట్లుగా సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. సైబర్ సెల్ సహాయంతో నిందితుడి గురించి పోలీసులకు సమాచారం తెలుసుకున్నారు.వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియోలో, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ముస్లిం టోపీ ధరించి ఉన్నట్లు చూపించారు.ఈ వీడియో AI సహాయంతో తయారు రూపొందించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. దీంతో ‘ప్యారా ఇస్లాం’ అనే సోషల్ మీడియా ఖాతాపై కేసు నమోదైంది. భారత శిక్షాస్మృతిలోని సెక్షన్లు 352, 353, 196(1), 299 ఐటీ చట్టంలోని సెక్షన్ 66 కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇదిలావుంటే, సీఎం యోగి మాత్రమే కాదు, ప్రధాని మోదీ, మహాత్మా గాంధీల డీప్ ఫేక్ వీడియోలు కూడా తయారు చేశారు సైబర్ కేటుగాళ్లు. ఈ విషయానికి సంబంధించి బల్లియాలో గుర్తు తెలియని వ్యక్తులపై కేసు కూడా నమోదైంది.