ప్రముఖ ఆలయాలకు క్యూ కట్టిన వైసీపీ నేతలు
రాష్ట్రవ్యాప్తంగా ప్రముఖ ఆలయాలకు క్యూ కట్టారు వైసీపీ నేతలు. లడ్డూ వ్యవహారంలో ప్రభుత్వ చర్యలతో తిరుమల పవిత్రత దెబ్బతిందని జగన్ పేర్కొన్నారు. వైసీపీ నేతలు కార్యకర్తలకు రాష్ట్రంలోని అన్ని ప్రముఖదేవాలయాలలో ప్రాయశ్చిత్త పూజలు చేయాలని పిలుపునిచ్చారు. దీనితో వైసీపీ నేతలు ఆలయాలకు పోటెత్తారు. మాజీ టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర రెడ్జి గంగమ్మ గుడిలో పూజలు చేశారు. తన హయాంలో తిరుమలలో ఎలాంటి అపచారం జరగలేదన్నారు. చంద్రబాబు తిరుమల పవిత్రతను మంటగలిపారని మండిపడ్డారు. పేర్నినాని, విడుదల రజని, అంబటి రాంబాబు వంటి నేతలు దేవాలయాలలో పూజలు నిర్వహించారు. లడ్డూ నెయ్యి కల్తీపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాాప్తంగా తమతమ నియోజకవర్గాలలో ప్రముఖ ఆలయాలలో పూజలు జరిపించారు వైసీపీ నేతలు.

