Andhra PradeshBreaking NewsHome Page Sliderhome page slider

మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ నేతల నిరసన

నగరంలో మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ నేతలు చేపట్టిన నిరసనలో ఉద్రిక్తత నెలకొంది. నిరసన ముదురుతుండటంతో పోలీసులు నేతలను అడ్డుకోవడంతో ఘర్షణాత్మక పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఈ సందర్భంగా పోలీసుల తీరుపై వైసీపీ సీనియర్‌ నేత అంబటి రాంబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబటి వ్యాఖ్యలపై పట్టాభిపురం సీఐ వెంకటేశ్వర్లు ఫైర్‌ అయినట్లు సమాచారం.

పోలీసుల జోక్యంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చినట్లు తెలుస్తోంది. నిరసన స్థలంలో అదనపు బలగాలను మోహరించారు.