Home Page SliderNational

రిటైర్మెంట్ ప్రకటించిన రెజ్లర్ సాక్షి మాలిక్

ప్రముఖ మహిళా రెజ్లర్,ఒలింపిక్ పతక విజేత సాక్షి మాలిక్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాగా ఆమె తన రెజ్లింగ్ కేరీర్‌కు గుడ్‌బై చెప్తూ..రిటైర్మెంట్ ప్రకటించారు. దీనికి కారణం WFI ఛీఫ్‌గా సంజయ్ మాలిక్ ఎన్నిక కావడం అని తెలుస్తోంది. బ్రిజ్ భూషణ్ WFI ఛీఫ్‌గా ఉన్న సమయంలో అతనిని ఆ పదవి నుంచి తప్పించాలని 40 రోజుల పాటు రోడ్ల మీదే నిరసన చేపట్టామన్నారు. అయితే ఆ సమయంలో మాకు ఎందరో అండగా నిలిచారని తెలిపారు. కాగా మళ్లీ బ్రిజ్ భూషణ్ సన్నిహితుడే WFI ఛీఫ్ అయితే నేను రెజ్లింగ్‌లో ఉండను అని ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. మరోవైపు  బ్రిజ్ భూషణ్ అనుచరులు ఎన్నికల్లో ఉండరన్న హామీని కేంద్ర ప్రభుత్వం నిలబెట్టుకోలేదని రెజ్లర్ భజరంగ్ పూనియా విమర్శించారు.