147 ఏళ్ల పాకిస్తాన్ క్రికెట్ చరిత్రలో చెత్త రికార్డ్
నిన్న బంగ్లాతో ఘోర ఓటమి, ఇప్పుడు ఇంగ్లాండ్ చేతిలో చిత్తు. వెరసి పాకిస్తాన్ క్రికెట్ జట్టు పరిస్థితి ఘోరంగా మారింది. ముల్తాన్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 556 పరుగులు చేసినా, రెండో ఇన్నింగ్స్‌లో పేలవ ప్రదర్శనతో, ఇంగ్లాండ్‌తో, ఇన్నింగ్స్ 47 పరుగుల తేడాతో ఓడింది. పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 556 పరుగులకు ఇంగ్లాండ్ దీటుగా బదులిచ్చింది. 823/7 భారీ స్కోరును ఉంచడంతో పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్‌లో 220 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ‘రికార్డ్-బ్రేకింగ్’తో టెస్టులో దీంతో చిత్తుగా ఓడింది. చెత్త రికార్డుల్లో పేరు నమోదు చేసుకుంది. మొదటి ఇన్నింగ్స్‌లో 500 పరుగులకు పైగా స్కోర్ చేసినా, ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోయిన మొదటి జట్టుగా చరిత్ర సృష్టించింది. 147 ఏళ్ల సుదీర్ఘ టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇలా ఓడిన జట్టు పాకిస్తాన్ మాత్రమే.