మహిళలు యూనివర్సిటీల్లో చదవడంపై నిషేధం..
తాలిబన్లు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశ వ్యాప్తంగా మహిళలకు యూనివర్సీటీ విద్యను నిషేధిస్తూ తాలిబన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తాలిబాన్ ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. మహిళా విద్యార్థులు యూనీవర్సిటీల్లో చదువుకోవడాన్ని నిషేధిస్తున్నట్లు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు ఉన్నత విద్యాశాఖ మంత్రి నేడా మహ్మద్ నదీమ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని తెలుపుతూ ట్వీట్టర్‌లో పోస్ట్ చేశారు. మరోవైపు న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశమై.. తాలిబన్లు నిర్భంధించిన ఇద్దరు అమెరికన్లు రిలీజ్ చేస్తున్నట్లు యూఎస్ విదేశాంగశాఖ వెల్లడించిన అనంతరం ఈ ప్రకటన వెలువడింది. అయితే తాలిబన్ల నిర్ణయంపై అమెరికాతోపాటు ప్రపంచ దేశాలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. మహిళలను ఆంక్షలకు గురిచేస్తున్న తాలిబన్లను.. ఆఫ్గనిస్థాన్‌లోని అందరి హక్కులను గౌరవించే వరకు అంతర్జాతీయ సమాజంలో చట్టబద్ధమైన సభ్యులుగా ఉండేందుకు ఆశించలేమని విదేశాంగ కార్యదర్శి ఆంటోని బ్లింకెన్ ఒక ప్రకటనలో తెలిపారు.


