నిద్రపోతూ….రూ.15లక్షల నగలు పోగొట్టుకున్న మహిళ
శ్రీకృష్ణా ట్రావెల్స్ మరో సారి వివాదంలో చిక్కుకుంది. గురువారం రాత్రి మండపేట నుంచి హైద్రాబాద్ కి బయలుదేరిన బస్సులో భారీ చోరీ జరిగింది. రూ.15లక్షల విలువైన బంగారు ఆభరణాలతో ప్రయాణిస్తున్న మహిళ నుంచి నగలు ఉన్న బ్యాగ్ కొట్టేశారు. నిద్ర నుంచి తేరుకున్న సదరు బాధిత మహిళ తన నగలున్న బ్యాగ్ పోయిందని గ్రహించింది.తీరా లబోదిబో అంటూ….నా బ్యాగ్ నా బ్యాగ్ అంటూ గగ్గోలు పెట్టింది. వెంటనే డయల్ 100కి కాల్ చేయడంతో పోలీసులు శ్రీకృష్ణా ట్రావెల్స్ ఉన్న బస్సు ప్రాంతానికి చేరుకున్నారు.హైద్రాబాద్‌లోని అబ్దుల్లాపూర్ మెట్ పీఎస్ కి బస్సుని తరలించారు.అందులో ప్రయాణిస్తున్న 40 మందిని కూడా పోలీస్ స్టేషన్ కి తరలించి విచారిస్తున్నారు.దీంతో సహచర ప్రయాణీకులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

