నేను వస్తే రైతుల తలలు పగలగొడతారా: వైఎస్ జగన్
- జనసందోహంగా మారిన మార్కెట్ యార్డ్పోలీసుల వలయం దాటుకుని తరలివచ్చిన రైతులు
- మామిడి మార్కెట్ యార్డ్ కు రాకుండా 25 చెక్ పోస్టుల ఏర్పాటు
- వైఎస్ జగన్ పర్యటనపై కూటమి ప్రభుత్వం కుట్రలు
- వైఎస్ జగన్ పర్యటనకు అడుగడుగునా పోలీసుల ఆంక్షలు
- వైఎస్సార్సీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్
- పోలీసుల లాఠీచార్జ్ కార్యకర్తలకు గాయాలు
- గాయపడిన కార్యకర్త వద్దకు వెళ్లకుండా జగన్ ను అడ్డుకున్న ఎస్పీ
- మాజీ మంత్రులు పెద్దిరెడ్డి, ఆర్కే రోజా వాహనాలు అడ్డగింత
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా పర్యటనకువచ్చిన నేపథ్యంలో అభిమానులు, రైతులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో బంగారుపాళ్యంకు తరలివచ్చారు. వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా పోలీసులు అడ్డంకులు సృష్టించారు. అయినప్పటికీ అభిమానులు, కార్యకర్తలు తమ ప్రియతమ నాయకుడి కోసం తరలివచ్చారు. ఈ క్రమంలో వారిపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈనేపథ్యంలో పోలీసుల ఓవరాక్షన్, లాఠీచార్జ్ప వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగారుపాళ్యంలో పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో వైఎస్సార్సీపీ నాయకుడు తీవ్రంగా గాయపడ్డారు. చంద్రగిరి యువజన విభాగం కార్యదర్శిపై పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో అతడి తలకు బలమైన గాయమై.. రక్తస్రావం జరిగింది. ఈ విషయం తెలిసి.. బంగారుపాళ్యం వద్ద కారు దిగేందుకు వైఎస్ జగన్ ప్రయత్నించారు. వైఎస్సార్సీపీ శ్రేణులను కొట్టారని కారు దిగేందుకు వైఎస్ జగన్‌కు తెలియడంతో కారును ఆపారు. లాఠీచార్ట్లో గాయపడిన కార్యకర్త వద్దకు వెళ్లేందుకు జగన్ ప్రయత్నించారు. ఈ క్రమంలో వైఎస్ జగన్‌ను కారు దిగకుండా ఎస్పీ మణికంఠ అడ్డుకునిఓవరాక్షన్ చేశారు. వైఎస్ జగన్ కారు దిగకుండా.. అక్కడి నుంచి పంపించేశారు.దీంతో, చిత్తూరు పోలీసులపై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల లాఠీచార్జ్ పై వైఎస్ జగన్ సీరియస్ అయ్యారు. గాయపడిన పార్టీ నేతను పరామర్శించనివ్వరా అంటూ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదెక్కడి న్యాయం అంటూ మండిపడ్డారు. మరోవైపు.. బంగారుపాళ్యంలో పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. పోలీసుల చెక్ పోస్టులు, వాహనాల తనిఖీలు చేస్తూ.. వైఎస్ జగన్ కాన్వాయ్ వాహనాలనూ లెక్కించి పంపుతున్నారు. హెలిప్యాడ్ నుండి మార్కెట్ యార్డు వరకు రోడ్డు పొడవునా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. తనిఖీల్లో భాగంగా ఒక ఎస్కాట్ వాహనాన్ని కూడా పోలీసులు ఆపేశారు. వైఎస్సార్సీపీ నేతల కార్లకూ అనుమతి లేదంటూ నిలిపివేశారు. హైవే మీద బారికేడ్లు పెట్టి ట్రాఫిక్ కు అంతరాయం కలిగించారు.కనీస గిట్టుబాటు ధర లేక తీవ్ర కష్టనష్టాల్లో కూరుకుపోయిన మామిడి రైతులను పరామర్శించేందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ఆగన్మోహన్ రెడ్డి బుధవారం చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మార్కెట్‌యార్డు సందర్శించారు. అక్కడ మామిడి రైతులను కలిసి, వారి సమస్యలపై ఆరా తీశారు. అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు.మామిడి రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, అందుకే ప్రభుత్వాన్ని నిద్ర లేపేందుకు ఇక్కడికి వచ్చానని వైఎస్ జగన్ తెలిపారు. ఇక్కడ 2 వేల మంది పోలీసులను మొహరించి, రైతులను రానీయకుండా అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మన రాష్ట్రంలో తప్ప, వేరే రాష్ట్రంలో కిలో మామిడి రూ.2కి దొరుకుతుందా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇదే మామిడికి మా ప్రభుత్వ హయాంలో కిలో రూ.22 నుంచి రూ.29వరకు అమ్ముకున్నారని అన్నారు.
కొనుగోళ్లలో ఎందుకంత జాప్యం:
ఏటా మామిడి కొనుగోలు ఉంటుంది. దాన్ని మే మొదటి వారంలో మొదలుపెట్టాలి. కానీ, ఆ పని ఎందుకు చేయలేదని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. జూన్ రెండో వారం తర్వాత మామిడి కొనుగోలు చేయడంతో.. మొత్తం పంట మార్కెట్ ముంచెత్తిందని, దీంతో కంపెనీలు ధరలు తగ్గించాయని ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లాలో 52 పల్ప్ కంపెనీలు ఉన్నా కానీ రైతులకు ధర రావడం లేదని తెలిపారు.నాడు ఆర్బీకే వ్యవస్థ ప్రతి అడుగులో రైతులకు తోడుగా ఉండేవి. కానీ, ఈ ప్రభుత్వం ఆ వ్యవస్థను నిర్వీరం చేసింది. ఇవాళ అన్ని వ్యవస్థలు దివాళా తీశాయని తెలిపారు.
ప్రభుత్వమే కొనుగోలు చేయాలి:
ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వదలాలి. మొత్తం పంటను ప్రభుత్వం స్వయంగా కొనుగోలు చేసి, మామిడి రైతులను ఆదుకోవాలి.
లేని పక్షంలో రైతుల పక్షాన నిలబడి పోరాడుతాం. ఇదే నా హెచ్చరిక అంటూ రైతులకు అండగా నిలుస్తామని తెలిపారు.
ఇది రాక్షస ప్రభుత్వం :
ప్రభుత్వం ఇంత క్రూరంగా వ్యవహరిస్తోంది. ఎందుకు రైతులను రానీయకుండా అడ్డుకుంటోంది? దాదాపు 1200 మంది రైతులను అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ ఒకరి తల పగలగొట్టారు. అసలు మీరు మనుషులేనా? అని పోలీసులపై రెచ్చిపోయారు వైఎస్ జగన్.
పోలీసులపై వైఎస్ జగన్ ఆగ్రహం :
బంగారుపాళ్యంలో రైతులపై జరిగిన పోలీసుల దాడులు, అరెస్టులపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతుల తలలు పగలకొడతారా? 12వందల మందిని జైల్లో పెడతారా అంటూ పోలీసులను ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉంది పోలీసులా? రాక్షసులా? అంటూ రెచ్చిపోయారు. కూటమి ప్రలోభాలు, లంచాలకు పోలీసులు లొంగొద్దు. రేపు పోలీసులను కూడా చంద్రబాబు మోసం చేస్తారు. అప్పుడు కూడా నేనే మీ తరుఫున పోరాటం చేయాల్సి వస్తుందని అన్నారు.