Home Page SliderNational

IPL ఫైనల్‌లో ధోనీపై నిషేధం విధించనున్నారా?

Share with

ఈ IPL సీజన్ ప్రారంభమైనప్పటి నుంచే జట్టులన్నీ హోరాహారీగా తలపడుతూ..వచ్చాయి. కాగా ఈ హోరాహోరీ పోరులో కేవలం నాలుగు జట్టులు CSK,GT,LSG,MI మాత్రమే ప్లేఆఫ్స్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్లేఆఫ్స్‌లో నిలిచిన CSK , GT జట్టులకు నిన్న  క్వాలిఫయింగ్ మ్యాచ్ జరిగింది. కాగా ఈ మ్యాచ్‌లో GT పై CSK టీమ్ విజయం సాధించి IPL ఫైనల్‌కు చేరింది. దీంతో CSK ప్లేయర్స్‌తో పాటు CSK అభిమానులు ఆనందంలో మునిగితేలుతున్నారు.  ఈ నేపథ్యంలో CSK టీమ్‌కు భారీ షాక్ తగిలే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. అదేంటంటే నిన్నటి మ్యాచ్‌లో CSK కెప్టెన్ ధోనీ అంపైర్లతో వాగ్వాదానికి దిగారు. అయితే ఇది కాస్త ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది.ఈ వాగ్వాదంతో మ్యాచ్ రిఫరీ ధోనీకి ఫైన్ లేదా ఒక మ్యాచ్ నిషేదం విధించే అవకాశం ఉందని వార్తలు పుట్టుకొస్తున్నాయి. కాగా మ్యాచ్ రిఫరీ మ్యాచ్ నిషేదం విధిస్తే ధోనీ ఫైనల్లో ఆడలేరు. ఇది CSK జట్టుకు పెద్ద దెబ్బ అనే చెప్పాలి. ఎందుకంటే జట్టు సారథి లేకుండా జట్టు ముందుకు వెళ్లడం అనేది గాల్లో దీపం పెట్టి దేవుడా అన్నట్టే ఉంటుంది. దీంతో రిఫరీ నిర్ణయంపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గాను మారడంతో ధోనీ అభిమానులు దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.