Breaking NewscrimeHome Page SliderPolitics

కుడి చేత్తో షేక్ హ్యాండిచ్చి ఎడ‌మ చేత్తో మొట్టికాయ‌లు వేసిన మంత్రి

హైద్రాబాద్‌లోని కాజీపేట‌లో ఇంటిగ్రేటెడ్ రైల్వే కోచ్ ఫ్యాక్ట‌రీ నెల‌కొల్పాల‌ని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్ ని శుక్ర‌వారం క‌లిసి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి .ఈ స‌మ‌యంలో అంతా సానుకూలంగా ఉన్న‌ట్లు ఫోటోల‌కు ఫోజులిచ్చిన‌ప్ప‌టికీ…రేవంత్ ఇలా వ‌చ్చి అలా వెళ్లాడో లేదో వెంటనే రైల్వే మంత్రి పుష్ఫ కు అనుకూలంగా స్టేట్ మెంట్ ఇచ్చాడు.తెలంగాణాలో ఉన్న కాంగ్రెస్ ప్ర‌భుత్వం సినిమా వాళ్ల‌ని బాగా ఇబ్బందులు పెడుతుందంటూ వ్యాఖ్యానించారు.సిని ఇండ‌స్ట్రీ వినాశ‌నానికి రేవంత్ బీజం వేస్తున్నార‌ని మండిపడ్డారు.దీంతో సీఎం స‌హా ఆయ‌న అనుచ‌రులు కూడా విస్తుబోయారు.ఇప్ప‌టి దాకా క‌లిసి అన్నీ విష‌యాలు చెప్పి వ‌చ్చాం…అంతా స‌రే అనేశారు.ఇలా ఢిల్లీ ఎయిర్ పోర్టుకు వ‌చ్చామో లేదో స్టేట్ మెంట్ మార్చి త‌మ ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించ‌డ‌మేంటంటూ అంత‌ర్మ‌థనంలో ప‌డ్డారు.దీంతో కుడి చేత్తో షేక్ హ్యాండిచ్చి ఎడ‌మ చేత్తో మొట్టికాయ‌లు అంటే ఇదేనంటూ చ‌ర్చించుకుంటున్నారు. ఖాజీపేట‌ల‌కు కొత్త రైలు లేదు, కొత్త స్టేష‌నూ లేదంటూ సోష‌ల్ మీడియాలో కేటిఆర్ పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారు.