crimeHome Page SliderNationalNews Alertviral

ఐదేళ్ల క్రితం చనిపోయిన భార్య ప్రత్యక్షం..భర్తకు జైలుశిక్ష..

అచ్చం సినిమా సంఘటనలాగే ఉన్నా, ఇది నిజంగా జరిగింది. ఐదేళ్ల క్రితం కనిపించకుండా పోయిన భార్య ప్రత్యక్షం కావడంతో అతనిపై హత్యా నేరం తొలగిపోయింది. 2020లో తన భార్య కనిపించడం లేదంటూ కర్ణాటకలోని బసవనహళ్లిలో కుశాల్ నగర్‌కు చెందిన సురేశ్ అనే వ్యక్తి పోలీసు కంప్లైంట్ ఇచ్చారు. ఇది జరిగిన ఆరు నెలల తర్వాత ఒక మహిళ అస్తిపంజరం దొరకడంతో అది అతని భార్య మల్లిగె అనే మహిళదే అనే నిర్ధారణకు వచ్చిన పోలీసులు సురేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. మహిళ శరీర అవశేషాలు గుర్తించడానికి ఆమె తల్లికి, బంధువులకు సమాచారం పంపగా, వారిచ్చిన వాంగ్మూలం ఆధారంగా అతనిపై ఛార్జిషీటు దాఖలు చేసి, రెండేళ్లు జైలులో పెట్టారు. అయితే కర్ణాటక హైకోర్టును ఆశ్రయించిన సురేశ్ అస్థిపంజరం డీఎన్‌ఏ టెస్టు చేయించాలని కోరగా, ఆ టెస్టులో ఆ మహిళ మల్లిగ కాదని తేలింది. దీనితో అతనికి బెయిల్ మంజూరయ్యింది. ఈ కేసులో సాక్షిగా ఉన్న ఒక వ్యక్తికి మడికెరి ప్రాంతంలో ఇటీవల ఒక మహిళ అచ్చం మల్లిగలాగే కనిపించింది. పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారు ఆమెను కస్టడీలో తీసుకుని విచారించగా, ఆమె తన ప్రియుడు గణేశ్ అనే వ్యక్తితో ఉన్నట్లు తేలింది. దీనితో సురేశ్ చేయని నేరానికి రెండేళ్ల జీవితాన్ని కోల్పోయారని, దర్యాప్తులో వైఫల్యానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అతనికి నష్టపరిహారం ఇప్పించాలని అతని తరపు న్యాయవాది మీడియాతో పేర్కొన్నారు.