తీన్మార్ మల్లన్న పై ఎందుకు కేసు నమోదు చేయలేదు?
రెడ్డి సామాజిక వర్గీయులను అనుచితంగా దూషించిన తెలంగాణ ఎమ్మెల్సీ తీన్ మార్ మల్లన్నపై కేసు ఎందుకు నమోదు చేయలేదని హైకోర్టు ప్రశ్నించింది. ఈ మేరకు పోలీసులకు నోటీసులు జారీ చేసింది.రెడ్లపై తీన్మార్ మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ సిద్దిపేటకు చెందిన కే. అరవింద్ రెడ్డి అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.అనంతరం డీజీపీ, పోలీస్ కమిషనర్లకు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆ వ్యక్తి హై కోర్టును ఆశ్రయించాడు. దీంతో కేసు ఎందుకు నమోదు చేయలేదో ఈ నెల 21 లోపు వివరణ ఇవ్వాలని సిద్దిపేట పోలీసులకు హై కోర్టు నోటీసులు జారీ చేసింది.

