రాత్రిపూట చపాతీ ఎందుకు తినకూడదు..?
మనదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఆహారాలలో చపాతీ ఒకటి. బాడీని ఫిట్ గా ఉంచుకోవడానికి, అలాగే బరువు తగ్గించుకోవడానికి ఈ మధ్యకాలంలో చాలా మంది యువత ఎక్కువగా రాత్రి సమయంలో అన్నం మానేసి చపాతీలు తింటుంటారు. అయితే ఉన్న ఫలంగా అన్నం మానేసి చపాతీలు తినడం మంచిది కాదని వైద్యులు సూచిస్తున్నారు.
రాత్రి పూట చపాతీ తింటే ఎలాంటి సమస్యలు వస్తాయి..?
చాలా మంది చపాతీని ఇష్టంగా తింటుంటారు. ఒక సాధారణ చపాతీలో 120 కేలరీలు ఉంటాయి. అయితే.. 3 లేదా 4 చపాతీల కంటే ఎక్కువ తింటే జీర్ణ సమస్యలు వస్తాయి. గోధుమ చపాతీ తినడం వల్ల శరీరంలో కార్బోహైడ్రేట్లు, గ్లూటెన్ పరిమాణం పెరిగి కొవ్వు పేరుకుపోతుంది. కాబట్టి చపాతీలను తగ్గించుకోవడం మంచిది. అలాగే చపాతీ ఎక్కువగా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఇది అధిక రక్తపోటు సమస్యకు దారి తీస్తుంది. రాత్రిపూట చపాతీ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. మధుమేహంతో బాధపడుతున్న రోగులకు రాత్రిపూట చపాతీ తినడం పెద్ద సమస్యగా మారుతుంది. చపాతీల్లో క్యాలరీలు, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. రాత్రిపూట చపాతీ తింటే జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి రాత్రిపూట చపాతీ తినకూడదు. ఉదయం, మధ్యాహ్నం చపాతీలు తినవచ్చు. చపాతీల్లో నూనె తక్కువగా ఉండేలా చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. సాధారణంగా ఎక్కువ సేపు నిల్వ ఉండే ఆహార పదార్థాలలో పోషకాలు అంతమైపోతాయి. అయితే చపాతీలు ఎంత ఎక్కువ సేపు నిల్వ ఉంటే ఆరోగ్యానికి అంత మంచిదని వైద్యులు చెబుతున్నారు.

