Home Page SliderTelangana

తెలంగాణాలో రద్దయిన పరీక్షలు మళ్లీ ఎప్పుడంటే?

తెలంగాణాలో ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం వెలుగులోకి రావడంతో TSPSC పలు రకాల పరీక్షలను రద్దు చేసింది. అయితే రద్దు చేసిన పరీక్షలు మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారో వెల్లడించలేదు. దీంతో పరీక్షలు రాసిన అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. కాగా వారు ఇటీవల TSPSC కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఈ నిరసనలో భాగంగా వారు ప్రశ్నాపత్రాలను భద్రపరిచే విషయంలో  TSPSC అధికారుల నిర్లక్ష్య ధోరణిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులను శాంతింప చేయడానికి గ్రూప్-1 ప్రిలిమ్స్ పునః పరీక్ష తేదీలను TSPSC ఇప్పటికే ప్రకటించింది. అయితే వీటితోపాటు రద్దు చేసిన AE,AEE,DAO పునఃపరీక్ష తేదీలను త్వరలో ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. కాగా వీటిపై ఈ రోజు కీలక సమావేశం నిర్వహించనున్న TSPSC పునఃపరీక్ష తేదీలను త్వరలోనే ఖరారు చేయనున్నట్లు సమాచారం. మరోవైపు ఈ కేసులో 9 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న సిట్..తాజాగా మరో ముగ్గురిని నిందితులుగా తేల్చింది. కాగా ఈ కేసులో TSPSCలో పనిచేస్తున్న మరో  42 మందికి కూడా నోటీసులు ఇచ్చింది.