‘మోదీని కలిస్తే తప్పేముంది’..రేవంత్ రెడ్డి
ప్రధాని నరేంద్రమోదీని ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా తాను కలిస్తే తప్పేముందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రానికి కావాల్సిన నిధుల కోసం ఒకసారి కాదు వంద సార్లయినా కలుస్తానని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి పనిచేస్తానని సీఎం రేవంత్ అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో శుక్రవారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అక్కడి పస్తాపూర్‌లో ప్రజాపాలన..ప్రగతి బాట బహిరంగ సభలో ప్రసంగించారు. తాను రాజకీయాలు కేవలం ఎన్నికల సమయంలోనే చేస్తానని, ఇతర సమయాలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర సహకారంతో కొనసాగుతాయని పేర్కొన్నారు. కేంద్రంపై అలిగితే నష్టం మనకేనన్నారు.