Home Page SliderLifestyleNationalNews AlertTrending Todayviral

‘నల్లగా ఉంటే తప్పేంటి? అది విశ్వమంతా వ్యాపించిన సత్యం’…సీఎస్ ఫేస్‌బుక్ పోస్ట్ వైరల్

శారదా మురళీధరన్ 1990 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారిణి. కొన్నాళ్ల క్రితమే కేరళ చీఫ్ సెక్రటరీగా నియమించబడ్డారు. అయితే ఆమె రంగు తక్కువుందని, నల్లగా ఉందని కొందరు కామెంట్లు చేశారు. దానికి కారణం అమె కంటే ముందు ఆ పదవిలో ఉన్న ఆమె భర్త తెల్లగా ఉండడమే. తన భర్త సీఎస్‌గా పనిచేసిన స్థానంలో ఆమె నియమితులవడం విశేషం. వారిద్దరినీ పోలుస్తూ పలువురు ఆమె రంగు గురించి సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టగా ఆమె దృష్టికి వచ్చాయి. అయితే దానికి తగినట్లు ఆమె సరైన జవాబు చెప్పారు. “నా రంగును నేను అంగీకరించాల్సిందే..నా భర్తతో పోలిక తెచ్చి,రంగు తక్కువగా ఉండడం సిగ్గుపడాల్సిన విషయంగా కొందరు మాట్లాడారు. కానీ నలుపు విశ్వమంతా వ్యాపించిన సత్యం. వర్షానికి ముందు, సాయంత్రం తర్వాత కనిపించేది. నలుపు లేనిదెక్కడ?” అంటూ ప్రశ్నించారు. తన చిన్నప్పుడే నల్లగా ఉండడం తప్పేమో అనుకుని తన తల్లిని నాలుగేళ్ల వయసులోనే మళ్లీ తన గర్భంలో తీసుకెళ్లి తెల్లగా పుట్టించమని అడిగానని, ఆ ప్రభావం 50 ఏళ్లు వచ్చినా ఇంకా వదిలిపెట్టలేదా? అని ప్రశ్నించారు. తన పిల్లల కారణంగా తాను నలుపు అందమైన వర్ణమని గుర్తించాను. అంటూ చెప్పుకొచ్చారు. ఆమె పోస్టుపై కేరళలోని ప్రతిపక్షనేత వీడీ సతీశన్ కూడా అసెంబ్లీలో స్పందించారు. ఆమె వెలిబుచ్చిన ప్రతీమాట తన హృదయాన్ని తాకిందని తన తల్లి కూడా నల్లగా ఉండేదని, వర్ణవివక్ష చర్చించాల్సిన అంశమని అభిప్రాయపడ్డారు. ఆమె గతంలో పలు కీలక హోదాలలో పనిచేసి, ప్రస్తుతం కేరళ సీఎస్‌గా సేవలందిస్తున్నారు.