బెట్టింగ్ యాప్స్‌పై విజయ్ దేవరకొండ ఏమన్నారంటే..
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ఆరోపణలపై స్పందించారు హీరో విజయ్ దేవరకొండ. తాను చట్టప్రకారం నిర్వహిస్తున్న స్కిల్ బేస్డ్ గేమ్స్‌కి మాత్రమే ప్రమోట్ చేశానని తాను ప్రమోషన్ చేసిన కంపెనీలు చట్ట ప్రకారమే ఉన్నాయని పేర్కొన్నారు. తాను ఏ ప్రకటన చేసినా అవి లీగల్‌గా ఉన్నాయా లేదా అనేది చూసుకుంటానని పేర్కొన్నారు. A23 అనే సంస్థ రమ్మీ గేమ్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా చేశానని, గతేడాదే ఆ సంస్థతో ఉన్న ఒప్పందం ముగిసిందని వివరణ ఇచ్చారు. చట్టవిరుద్ధంగా పని చేస్తున్న ఏ సంస్థకు నేను బ్రాండ్ అంబాసిడర్‌గా లేనని చెప్పారు.