HealthHome Page SliderNational

వైరల్ ఫీవర్ ఉంటే ఏం తినాలి?

వైరల్ ఫీవర్‌తో బాధపడేవారు రోగనిరోధక శక్తిని తగ్గించే ఆహారాలకు దూరంగా ఉండాలి. చక్కెరలతో కూడిన స్వీట్లు, కూల్‌డ్రింక్స్, ప్యాకేజింగ్ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి. కొవ్వుతో కూడిన ఆహారం, నూనెలో వేయించిన పదార్థాలు, ఉప్పు ఎక్కువగా ఉండే పచ్చళ్లు వంటి పదార్థాలకు దూరంగా ఉండాలి. దీనివల్ల జ్వరం తగ్గడానికి ఎక్కువ సమయం పడుతుంది. కారాలు, మసాలాలు ఉండే పదార్థాల వల్ల అజీర్ణం చేసి, కడుపు నొప్పికి కారణమవుతుంది. కొవ్వు ఉండే పాలు తాగడం వల్ల  కూడా జలుబు ఉన్నప్పుడు శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిని కలిగిస్తాయి. మంచినీరు, హెర్బల్ టీ బాగా తీసుకోవడం మంచిది. నిమ్మ జాతికి చెందిన పండ్లు, ప్రొటీన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే మంచిది. ఉడికించిన కూరలు, సూప్‌లు తీసుకుంటే త్వరగా జీర్ణమవుతాయి.