దేశంలో అత్యధిక వేతనం పొందుతున్న ఐటీ సీఈఓ, జీతం ఎంతంటే?
2023-24 ఆర్థిక సంవత్సరానికి HCLTechnologies CEO సి. విజయకుమార్ మొత్తం జీతం సుమారు $10.06 మిలియన్లు (సుమారు ₹ 84.16 కోట్లు) అని కంపెనీ నివేదిక వెల్లడించింది. దీంతో ఈ ఏడాది భారతీయ ఐటీ సేవల కంపెనీల సీఈఓలలో అత్యధిక వేతనం పొందిన వ్యక్తిగా విజయ్ కుమార్ నిలిచాడు. HCLTech వార్షిక నివేదిక 2023-2024 ప్రకారం, విజయకుమార్ పారితోషికం సంవత్సరానికి 190.75 శాతం మేర పెరిగింది. జీతం ప్యాకేజీలో దాదాపు $1.96 మిలియన్ల మూల వేతనం (రూ. 16.39 కోట్లు), పనితీరుతో ముడిపడి ఉన్న $1.14 మిలియన్ల బోనస్ (రూ. 9.53 కోట్లు), దీర్ఘకాల ప్రోత్సాహకం (LTI) నగదు భాగం దాదాపు $2.36 మిలియన్లు (Rs 19.74 కోట్లు)తోపాటుగా LTIలో భాగంగానే, మరో $4.56 మిలియన్లు (రూ. 38.15 కోట్లు) కూడా అందుకున్నాడు. రిస్ట్రిక్టెట్ స్టాక్ యూనిట్ల (RSUలు) పెర్క్విసిట్ విలువ, $0.04 మిలియన్లుగా ఉంది.

విజయకుమార్ వేతనం ఉద్యోగుల యావిరేజ్ జీతం కంటే 707.46 రెట్లు ఉంది. సంవత్సరానికి జీతం 7.07 శాతం మేర పెరిగింది. మూల వేతనం విషయానికొస్తే, దాదాపు ₹ 66 కోట్లు ఆర్జించిన ఇన్ఫోసిస్ CEO సలీల్ పరేఖ్, దాదాపు ₹ 50 కోట్లు అందుకున్న విప్రో కొత్త CEO శ్రీని పల్లియా, సుమారు ₹ 25 కోట్లు ఆర్జించిన TCS CEO K కృతివాసన్‌లను అధిగమించాడు. షేర్‌హోల్డర్‌లకు రాసిన లేఖలో, విజయకుమార్ కంపెనీ పనితీరు గురించి మాట్లాడుతూ, ” సంవత్సరానికి $13.3 బిలియన్ల ఆదాయంతో, 5.4 శాతం YoY పెరుగుదలతో, 18.2 శాతం EBIT మార్జిన్‌తో ముగించాము.” టైర్ 1 గ్లోబల్ IT సేవల కంపెనీలలో HCLTech అత్యధిక ఆదాయ వృద్ధి రేటును సాధించిందని చెప్పాడు. GenAI, క్లౌడ్, డేటా, సైబర్ సెక్యూరిటీ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలలో వృద్ధికి అవకాశాలను కంపెనీ అంచనా వేస్తోందని తెలిపాడు.

HCLTech డిజిటల్, ఇంజినీరింగ్, క్లౌడ్, AI సాఫ్ట్‌వేర్‌లలో మార్కెట్ లీడర్‌గా ఎదుగుతోంది. కంపెనీ ఇప్పటికే జెనరేటివ్ AIలో వచ్చే ఆర్థిక సంవత్సరంలో 50,000 మంది ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాలని యోచిస్తోంది. మొదటి నాలుగు భారతీయ IT కంపెనీలలో, TCS FY24లో అత్యధికంగా ₹ 2,40,893 కోట్ల ఆదాయంతో అగ్రస్థానంలో ఉంది. ఇన్ఫోసిస్ ₹ 1,53,670 కోట్లతో, హెచ్‌సిఎల్‌టెక్ ₹ 1,09,913 కోట్లతో, విప్రో ₹ 89,794 కోట్లతో మార్కెట్ లీడర్లుగా ఉన్నాయి.