మా గతేంటి? ఏపీలో వాలంటీర్ల డిమాండ్
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాలంటీర్లకు ఉద్యోగ భద్రతపై ఆశలు సన్నగిల్లుతున్నాయి. మా గతేంటి? అని ప్రశ్నిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయినప్పటి నుండి తమకు మూడు నెలలుగా జీతాలు లేవని వాపోతున్నారు. చంద్రబాబు ఎన్నికలలో హామీ ఇచ్చిన వాలంటీర్లకు రూ. 10 వేల జీతాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల సమయంలో రాజీనామా చేసిన లక్ష మందిని కూడా విధుల్లోకి తీసుకోవాలని కోరుతున్నారు. వాలంటీర్ల అసోషియేషన్ ఈ మేరకు కొన్ని డిమాండ్లు ప్రభుత్వం ముందు పెట్టింది. ఈ నెలాఖరులోగా తమకు స్పష్టమైన ప్రకటన రాకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు తమ ఆవేదనను తెలిసేలా ఈ నెల 31 నుండి వాలంటీర్ల నివేదన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ప్రకటించారు.