పరగడుపున అరటిపండు తింటే ఏమవుతుంది?
అరటిపండు తింటే చాలా ప్రయోజనాలు ఉంటాయి. అరటిపండులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల చాలా మేలు జరుగుతుంది. కాని దీనిని పరగడుపున తింటే మాత్రం ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు.
అరటిపండులో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. దానివల్ల సడన్‌గా షుగర్ లెవల్స్ పెరుగుతుంటాయి. దీనివల్ల షుగర్ ఉన్న వారికి ప్రమాదం. పొటాషియం ఎక్కువగా ఉండడం వల్ల హైపర్‌కలేమియాకు గురయ్యే అవకాశం ఉంది.
పరగడుపున అరటిపండు తింటే శరీరానికి ఐరన్, జింక్, కాల్షియంలు అందవు. అంతే కాదు ఈ రోజుల్లో చాలా మందికి బాధించే సమస్య బరువు పెరగడం. బరువు తగ్గాలనుకునే వారు ఉదయం పూట అరటిపండు తినకపోవడమే మంచిది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతగా ఉదయం పూట అరటిపండు తినాలని ఉంటే ఏదైన తిన్న తరువాత తినమని సూచిస్తున్నారు.

