ముఖ్యమంత్రి పదవి దక్కకపోతే ‘షిండే’కు ఏం కావాలి?
మహారాష్ట్రలో మహాయుతి కూటమి విజయం సాధించి, మూడు రోజులవుతున్నా ఇంతవరకూ ముఖ్యమంత్రి ఎవరో తెలియలేదు. బీజేపీ తర్జనభర్జనలు, కూటమి నేతల మంతనాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ముఖ్యమంత్రి పదవి దక్కకపోతే ప్రత్నామ్యాయం ఏం అడుగుదామా అని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మంగళవారం జరిగిన కూటమి నేతల సమావేశంలో తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోతే కనీసం హోంశాఖ ఇవ్వాలని షిండే ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ అధిష్టానం భాగస్వామ్య పక్షాలలో ఎలాంటి భేదాభిప్రాయాలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. కూటమి నేతలందరూ ఒక స్థిరమైన నిర్ణయానికి వచ్చేవరకూ ముఖ్యమంత్రి పేరును కూడా ప్రకటించకూడదని అధిష్టానం నిర్ణయించింది.

