మద్యం మత్తులో పంచాయితీ ఈఓ ఏం చేశాడంటే..
ఓ గ్రామ పంచాయతీ ఈఓ తెల్లవారుజామునే తప్ప తాగి కారుతో మార్నింగ్ వాకర్ ను ఢీకొట్టాడు. ఈ ఘటన బాసరలో చోటు చేసుకుంది. బాసర గ్రామ పంచాయతీ ఈఓ గోవిందరాజు మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్ చేశాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన మార్నింగ్ వాకర్ విజయరావును కారుతో ఢీ కొట్టడంతో అతడికి గాయాలయ్యాయి. అనంతరం ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా వెళ్లిపోయి గ్రామ పంచాయతీ ఎదురుగా కారు పార్కు చేసి మద్యం సేవించి కార్యాలయంలోని తన టేబుల్ పై పడుకున్నాడు. గాయాలపాలైన విజయరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

